సిద్ధార్ధ్ 3 బిహెచ్‌కె ట్రైలర్‌.. ప్రజలందరి కధ

June 28, 2025
img

సామాన్య మధ్యతరగతి ప్రజల కల, జీవితాశయం సొంత ఇల్లు. దానిని సాధించడం కోసం వారుపడే ఆరాటం, శ్రమ, సొంత ఇంటి కలలు.. ప్రతీ ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటారు. ఓ మద్యతరగతి కుటుంబం సొంత ఇంటి కలనే రచయిత, దర్శకుడు శ్రీ గణేష్ ‘3 బిహెచ్‌కె’ పేరుతో ఓ చక్కటి సినిమాగా తెరకెక్కించారు. ఈ 3 బిహెచ్‌కె ట్రైలర్‌ విడుదలైంది. అది చూస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరూ దానిలో లీనం అవుతారు. దర్శకుడు ఎంచుకున్న కధతో ట్రైలర్‌లోనే అనేక భావోద్వేగాలు పండించి చూపారు. ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

ఈ సినిమాలో సిద్ధార్థ్, శరత్ కుమార్‌, దేవయాని ప్రధాన పాత్రలు చేయగా మీఠా రఘునాథ్, చైత్ర, యోగిబాబు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: అమృత్ రామ్నాధ్, కెమెరా: దినేష్ కృష్ణన్‌, స్టానిస్లస్, ఎడిటింగ్: గణేష్ శివ, ఆర్ట్: వినోద్ రాజ్‌కుమార్‌. ఎన్‌ చేశారు. 

శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ జూలై 4న విడుదల చేస్తున్నారు.              

Related Post