టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ చాలా నేర్చుకోవాలి: ముఖేష్ ఖన్నా

December 13, 2024
img

ఇంతకాలం ఉత్తరాది రాష్ట్రాలన్నీటినీ బాలీవుడ్‌ ఏలుతుండేది. కానీ రాజమౌళి ‘బాహుబలి’ని పంపించి బాలీవుడ్‌ని జయించారు. అప్పటి నుంచి బాలీవుడ్‌పై దక్షిణాది పాన్ ఇండియా మూవీల దండయాత్ర మొదలైపోయింది. తాజాగా పుష్ప-2తో బాలీవుడ్‌ విలవిలలాడుతోందిప్పుడు. బాలీవుడ్‌ స్టార్ హీరోల భారీ బడ్జెట్ హిందీ సినిమాలు సాధించలేని కలెక్షన్స్‌ పుష్ప-2 సాధిస్తుండటం చూసి నివ్వెరపోతున్నారు. 

అయితే ఉత్తరాది ప్రజలు ఊరకే పుష్ప-2ని అంతగా ఆదరించలేదని, ఆ సినిమాలో అల్లు అర్జున్‌ నటన ఒక్కటీ ఒక ఎత్తు కాగా, సినిమాలో పాత్రలు, సన్నివేశాలు, స్క్రీన్ ప్లే, సంగీతం, కెమెరా వర్క్ అన్నీ ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నట్లు సాగాయని బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు, సినీ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. 

బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా, పుష్ప-2లో అల్లు అర్జున్‌ నటనకు ‘ఫిదా’ అయిపోయానన్నారు. అల్లు అర్జున్‌ అంటే ఎవరో తనకు తెలియదని కానీ పుష్ప-2 చూసిన తర్వాత ఇప్పడు అతను నటించిన పాత  సినిమాల సీడీలన్నీ తెప్పించుకొని చూస్తానన్నారు. 

‘పుష్ప-2లో భార్యాభర్తల మద్య వచ్చే సన్నివేశాలు చాలా పులకరింపజేశాయి. కానీ హిందీ సినిమాలలో అటువంటి సన్నివేశాలలో మితిమీరిన శృంగారాన్ని చూపుతూ వాటితో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తారని ముఖేష్ ఖన్నా అన్నారు. దక్షిణాది దర్శక నిర్మాతలు, నటీ నటుల నుంచి బాలీవుడ్‌ చాలా నేర్చుకోవాలన్నారు ముఖేష్ ఖన్నా అన్నారు.

Related Post