ఆదిపురుష్‌ కోసమే సలార్ అప్‌డేట్స్ ఆపుతున్నారట!

May 31, 2023
img

ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ఆదిపురుష్‌ జూన్ 16న, సలార్ సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి. ఆదిపురుష్‌ సినిమా హడావుడి కనిపిస్తోంది కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకొన్న సలార్ సినిమాకు సంబందించి ఎటువంటి అప్‌డేట్స్ రావడం లేదు. 

సలార్ కూడా చాలా బారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ముందుగా విడుదల కాబోతున్న ఆదిపురుష్‌ సినిమాకు సలార్ వలన ఎటువంటి నష్టమూ జరగకూడదనే అప్‌డేట్స్ ఇవ్వకుండా నిలిపి ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఆదిపురుష్‌ టీజర్‌ దెబ్బ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కనుక దాని హైప్ అలాగే కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులలో ఆసక్తి, అంచనాలు పెంచిన్నట్లయితే భారీ కలక్షన్స్‌ రాబట్టగలుగుతుంది. 

అంతేకాదు... సలార్‌ను కూడా ఆదిపురుష్‌ సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏవిదంగా అంటే ఆదిపురుష్‌ విడుదలయ్యే ఒక్క రోజుముందు సలార్ ఫస్ట్-లుక్‌, టీజర్‌ వగైరాలు నేరుగా ఆదిపురుష్‌ రిలీజ్‌ కాబోయే థియేటర్లలోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభాస్‌ రెండు చిత్రాలకు ఒకదాని వలన మరొకటి లాభపడతాయని భావిస్తున్నారు. అంటే సలార్ ప్రమోషన్స్ జూన్ 15 నుంచి మొదలవుతాయని ఆశించవచ్చు. 

ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణగాధ ఆధారంగా పౌరాణిక సినిమాగా ఆదిపురుష్‌ తీయగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా సలార్ సిద్దం అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. జగపతి బాబు, ఈశ్వరీరావు, మధు గురుస్వామి, పృధ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.  

రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంభోలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ సలార్‌ను పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, సంగీతం: రవి బస్‌రూర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.   


Related Post