బోయపాటి ర్యాపో... మన దర్శకులు ఇంతకుమించి ఎదగలేరేమో?

May 15, 2023
img

రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా తొలి ప్రమో ‘బోయపాటి ర్యాపో’ పేరుతో నేడు రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. దానిలో బోయపాటి, రామ్ పోతినేని మార్క్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చూపారు. 

కమర్షియల్ సినిమాలలో వినిపించే రొటీన్ బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ దీనిలో కూడా వినిపించారు. ఎంతో ఆర్బాటంగా విడుదల చేసిన బోయపాటి ర్యాపో, దానిలో కంటెంట్‌ని చూసినప్పుడు మన తెలుగు దర్శకులు ఇంతకు మించి ఎదగలేరా? అనే సందేహం కలుగుతుంది. ఎప్పుడూ హీరో ఎలివేషన్ సాంగ్స్, హీరో దెబ్బకి విలన్‌ గ్యాంగులు గాలిలో ఎగిరిపడుతుంటం, అది చూసి హీరోయిన్‌ మురిసిపోయి హీరోతో విదేశాలలో డ్యూయెట్ సాంగ్‌ చేయడం... ఎప్పుడూ ఇంతేనా? అనిపించకమానదు. ఇలాంటి పసలేని మాస్ మసాలా సినిమాలను మళ్ళీ పాన్ ఇండియా మూవీలుగా తీస్తుండటం ఇంకా విడ్డూరం. 

బోయపాటి శ్రీను కధ, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, యాక్షన్: స్టంట్స్ శివ, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. 


Related Post