రికార్డ్స్ లో నా పేరుండటం కాదు... నాపేరు మీదే రికార్డ్స్ ఉంటాయి!

January 07, 2023
img

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్‌ జంటగా నటించిన వాల్తేర్ వీరయ్య ట్రైలర్‌ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్‌ మామూలుగా లేదు... చిరంజీవి అభిమానులు కాలరేగరేసుకొని గర్వంగా తిరిగేలా ఉంది. “మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయనని సూసి...”, “ రికార్డ్స్ లో నా పేరుండటం కాదు... నాపేరు మీదే రికార్డ్స్ ఉంటాయి....,” “మీ కధలోకి నేను రాలా... నా కధలోకే మీరందరూ వచ్చారు..” వంటి సీరియస్ డైలాగులు, “రోజూ మీరక్కడ నుంచి కనబడతారేటండీ? కనబడకపోతే అది బెస్ట్ వ్యూ ఎందుకవుతాదండి...”అనే చిరంజీవి మార్క్ కామెడీ డైలాగ్స్ వింటే చిరంజీవి అభిమానులకు పూనకాలు రాకుండా ఉంటాయా?

"వైజాగులో గట్టి వేటగాడు లేడని ... ఓ పులి పూనకాలతో ఊగుతోందట...” అంటూ మాస్ మహరాజ్ రవితేజ చెప్పే డైలాగ్ ఆయన అభిమానులకి పూనకాలు తెప్పించేలాగే ఉంది.

ట్రైలర్‌ చూస్తే సినిమా టేకింగ్, ప్రెజంటేషన్ చాలా రిచ్‌గా ఉన్నట్లు అర్దమవుతుంది. అలాగే ఇదో డ్రగ్స్ స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే కధ అని కూడా అర్దమవుతుంది. మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకి ఈ సంక్రాంతికి మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు అర్దమవుతోంది. వాల్తేర్ వీరయ్య ఈ నెల 13న విడుదల కాబోతోంది.

Related Post