శాకుంతలం కోసం విదేశీ మ్యూజిషియన్స్... ఈ మ్యూజిక్ విన్నారా?

January 05, 2023
img

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించిన ‘శాకుంతలం’ సినిమా ఫిభ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. శకుంతల, దుష్యంత మహారాజుల ప్రేమగాధ ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాని అద్భుత ప్రేమకావ్యంగా తెరకెక్కించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం దర్శకుడు గుణశేఖర్, సంగీత దర్శకుడు మణిశర్మ హాలీవుడ్ సినిమాలకి తీసిపోని విదంగా హంగేరీ మ్యూజిషియన్స్ చేత అద్భుతమైన సంగీతం అందించబోతున్నారు. ఆ మ్యూజిక్ రికార్డింగ్‌కు సంబందించిన వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. ఓ తెలుగు సంగీత దర్శకుడు అంతర్జాతీయ మ్యూజిషియన్స్ చేత భారతీయ, విదేశీ బాణీలను కలుపుతూ అద్భుతంగా రూపొందించిన ఆ సంగీతం విని తీరాల్సిందే. యూట్యూబ్‌లో వింటున్నప్పుడే మహాద్భుతంగా ఉన్న ఆ సంగీతం సినిమా థియేటర్లలో వింటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అనిపించకమానదు.      

శాకుంతలం సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ ఈ సినిమాలో చిన్నారి భరతుడిగా (శకుంతల, దుష్యంతుల కుమారుడు) కనిపించబోతోంది. 

నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్, గుణా టీం వర్క్స్ బ్యానర్లపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించారు. 

 

Related Post