సమంత టాలెంట్, ఎనర్జీ లెవెల్స్ చూసి ఆశ్చర్యపోయా: యానిక్ బెన్2

November 02, 2022
img

సమంత ప్రధానపాత్రలో రూపొందిన యశోద సినిమా ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవలే యశోద ట్రైలర్‌ కూడా విడుదలై మంచి ప్రశంశలు అందుకొంది. కానీ ఆ తర్వాత సమంత తనకు చాలా అరుదైన మయోసైటీస్ అనే వ్యాధికి గురయ్యానని తెలిపింది. ఇది మనిషిని క్రమంగా బలహీనపరుస్తూ చివరికి ప్రాణాలు తీస్తుంది. ఈ వ్యాధికి తాత్కాలిక ఉపశమనం కలిగించే మందులున్నాయి కానీ శాశ్విత నివారణకు చికిత్స అందుబాటులో లేదు.

సమంతకు అరుదైన ఈ వ్యాధి సోకిందని తెలియగానే ఆమె అభిమానులు తల్లడిల్లిపోయారు. సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఆమెకు ధైర్యం చెపుతూ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు. చివరికి అక్కినేని కుటుంబం నుంచి అఖిల్, సమంత్ కూడా ఆమెకు సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు. 

ఈ సందర్భంగా యశోద చిత్రానికి యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేసిన యానిక్ బెన్2 సమంత ఎంతగా కష్టపడిందో తెలియజేస్తూ, షూటింగ్‌కి సంబందించి ఓ మేకింగ్ వీడియోని ఆమె అభిమానులతో ట్విట్టర్‌లో షేర్ చేసుకొన్నారు. సమంత ఎంత క్లిష్టమైన విషయాన్నైనా చాలా త్వరగా నేర్చుకొంటుందని, ఆమె శ్రద్ద, పట్టుదల ఎనర్జీ లెవెల్స్ చూసి తాను కూడా చాలా ఆశ్చర్యపోయానని చెప్పారు. ఆమె చాలా పట్టుదల కలిగిన మహిళ కనుక తప్పకుండా ఈ సమస్యను కూడా అధిగమిస్తుందని యానిక్ బెన్2 నమ్మకం వ్యక్తం చేశారు.

అందుకు సమంత అతనికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ, “మీతో పనిచేస్తున్నప్పుడు అత్యుత్తమైనదానికే నేను ప్రయత్నిస్తాను, “ అంటూ ట్వీట్ చేశారు. యానిక్ బెన్2 షేర్ చేసిన యశోద మేకింగ్ వీడియో మీ కోసం..          


Related Post