నాగార్జున ఘోస్ట్... ట్రైలర్‌ హాలీవుడ్‌ సినిమాకి తీసిపోదు

September 30, 2022
img

యువదర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సోనల్‌ చౌహన్‌ జంటగా నటించిన యాక్షన్ సినిమా ‘ది ఘోస్ట్’ అక్టోబర్‌ 5వ తేదీన విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ట్రైలర్‌ విడుదలచేశారు. 

“డబ్బు, సక్సస్ సంతోషం కంటే శత్రువులను ఎక్కువ సంపాదిస్తుంది..” అంటూ నాగార్జున చెప్పే డైలాగ్, అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రేంజ్ ఏమిటో తెలుస్తుంది. ఈ సినిమాకి మార్క్‌ కె రాబిన్‌, భరత్‌ సౌరబ్‌ అందించిన సంగీతం కూడా సినిమా స్థాయిని మరింత పెంచుతుంది. ట్రైలర్‌లో అది స్పష్టంగా వినబడింది. అలాగే మెరుపువేగంతో సాగే యాక్షన్ సీన్స్‌ని అంతే అద్భుతంగా చక్కటి యాంగిల్స్‌లో కెమెరాతో క్యాచ్ చేస్తూ తెరకెక్కించిన విధానం కూడా చాలా బాగుంది. కనుక ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశముంది. సునీల్‌ నారంగ్‌ పూస్కూర్‌ రామ్మోహనరావ్‌, శరత్‌ మరార్‌ కలిసి ఈ సినిమాను నిర్మించారు. 


Related Post