లైగర్‌ కోసం విజయ్ దేవరకొండ ఎంత కష్టపడ్డాడో చూశారా?

September 20, 2022
img

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన లైగర్‌ సినిమా ఫ్లాప్ అయ్యుండవచ్చు కానీ ఆ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంతగా కష్టపడి ఉంటాడో అతని బాడీ షేప్ చూస్తే అర్దమవుతుంది. తాజాగా విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్‌లో లైగర్‌ కోసం తాను తీసుకొన్న శిక్షణకు సంబందించి ఓ వీడియోను అభిమాలతో షేర్ చేసుకొన్నాడు. దానిలో బాక్సింగ్ సన్నివేశాలకు తగ్గట్లుగా ఏవిదంగా శిక్షణ పొందాడో తెలుస్తోంది. దీంతో పాటు తన అభిమానుల కోసం ఓ చిన్న సందేశం కూడా పెట్టాడు విజయ్ దేవరకొండ. 

“కష్టపడి పనిచేయండి. వీలైనంత ఎక్కువగా శ్రమిస్తూ కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని విజయాలను సాధించి ఆనందించండి. జీవితాన్ని మీకు నచ్చిన్నట్లు జీవించండి,” అని మెసేజ్ పెట్టాడు. 

Related Post