అమెజాన్ ప్రైమ్‌లో పంచాయతీ...జీ5లో రెక్కీ

June 14, 2022
img

ఓటీటీలలో నిత్యం కొత్త సినిమాలు లేదా వెబ్‌ సిరీస్ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ఏళ్ళతరబడి సాగే అర్ధంపర్ధం లేని టీవీ సీరియల్స్ చూసి చూసి విసుగెత్తిపోయిన ప్రేక్షకులకు హాలీవుడ్ సినిమాలకు తీసిపోని స్థాయిలో వెబ్‌ సిరీస్‌ ఓటీటీలలో విడుదలవుతున్నాయి. 

విజయ్‌ కుమార్‌ కలివరపు దర్శకత్వంలో యాంకర్ సుమ నటించిన ‘జయమ్మ పంచాయతీ’ ఇటీవల విడుదలై మంచి పాజిటివ్ టాక్‌ వచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదనిపించుకొంది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో జయమ్మ పంచాయతీ ప్రసారమవుతోంది. 

నయనతార తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో చేసిన చిత్రం ఓ2 (ఆక్సిజన్). ఈ సినిమాలో నయనతార ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడే ఓ పిల్లాడికి తల్లిగా నటించింది. కొడుకుని వెంటపెట్టుకొని బస్సులో ప్రయాణిస్తుండగా దారిలో ఓ సొరంగమార్గంలో బస్సు చిక్కుకుపోతుంది. అప్పుడు నయనతార తన కొడుకుని ఏవిదంగా కాపాడుకొంటుంది?అనే కధాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ కొత్త సినిమా నేరుగా డిస్నీ+హాట్ స్టార్‌లో ఈ నెల 17వ తేదీ నుంచి ప్రసారం కాబోతోంది.

పోలూరు కృష్ణ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌ ‘రెక్కీ’. సుమారు మూడు దశాబ్ధాల క్రితం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌ హత్య కధాంశంగా ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందించారు. రెక్కీలో శివ బాలాజీ, శ్రీరామ్, ధన్య బాలకృష్ణ, తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ నెల 20వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి జీ5లో రెక్కీ వెబ్‌ సిరీస్‌ ప్రసారం కాబోతోంది. 

ఇవి కాక అమెజాన్ ప్రైమ్‌లో జూన్‌ 14న అవతార పురుషా-1 (కన్నడ సినిమా), జూన్‌ 17న సుజల్ (తమిళ్ వెబ్‌ సిరీస్‌) ప్రసారం కాబోతున్నాయి. 

నెట్‌ఫ్లిక్స్‌లో జూన్‌ 15న గాడ్స్ ఫేవరెట్ ఇడియట్ (వెబ్‌ సిరీస్‌), ది రాత్ ఆఫ్ గాడ్ (హాలీవుడ్ మూవీ) విడుదల కాబోతున్నాయి. జూన్‌ 17న షి (హిందీ వెబ్‌ సిరీస్‌), జూన్‌ 18న ఆపరేషన్ రోమియో (హిందీ), సిబిఐ 5ద బ్రెయిన్స్ (మలయాళ చిత్రం) విడుదలకానున్నాయి. 

జీ5 ఓటీటీలో జూన్‌ 14న ఇన్ఫినీట్ స్టోర్స్ (హాలీవుడ్ చిత్రం), జూన్‌ 17న ఫింగర్ టిప్ (హిందీ, తమిళ్ వెబ్‌ సిరీస్‌) ప్రసారం కానున్నాయి. 

జూన్‌ 17వ తేదీన డిస్నీ +హాట్ స్టార్‌లో మసూమ్ హిందీ చిత్రం విడుదలకానుంది.

Related Post