ఎఫ్3లో కామెడీ...అబ్బో చూసి తీరాల్సిందే

May 09, 2022
img

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా ప్రధాన పాత్రలలో వస్తున్న ఎఫ్-3 సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. ఎఫ్-2కి సీక్వెల్‌గా వస్తున్న దీనిలో కామెడీ ఇంకా గొప్పగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తేనే అర్దమవుతుంది. కనుక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవడం ఖాయంగానే ఉంది.

ఈసారి ఎఫ్-3లో వెంకటేష్‌కి  రేచీకటి, వరుణ్ తేజ్‌కి నత్తి సమస్యలున్నట్లు ట్రైలర్‌లో చూపారు. కనుక దాంతో వారిద్దరూ కామెడీ ఇంకా పండించారు. వాళ్ళు నలుగురు చేసిన కామెడీతో పాటు వెన్నెల కిషోర్, సునీల్, మురళీశర్మ, రఘుబాబు, ప్రదీప్, ఆలీ, నిర్మలమ్మ, వై.విజయ, ప్రగతి, తదితరులు చేసిన కామెడీ చూస్తే నవ్వాపుకోలేము.

ఈసారి డబ్బు, బంగారం, ఈజీ మనీ చుట్టూ ఎఫ్-3 నడుస్తుందని ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది. ఇంతమంది పెద్ద పెద్ద నటులందరిని పెట్టి ఎక్కడా గాడి తప్పకుండా కామెడీ పండించడం చాలా కష్టం. కానీ ట్రైలర్ చూస్తే దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి మరింత అద్భుతంగా కామెడీ పండించారని అర్దమవుతోంది.

ఈ నెల 27వ తేదీన ఎఫ్-3 విడుదల కాబోతోంది. శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఎఫ్3కి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించాడు.


Related Post