టక్ జగదీష్ : రివ్యూ

September 10, 2021
img

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. తీరు వర్మ హీరోయిన్ గా నటించిన టక్ జగదీష్ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. అమేజాన్ ప్రైం వీడియోలో డైరెక్ట్ డిజిటల్ రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

భూదేవిపురం లో పెద్ద మనిషి ఆది శేషగిరి నాయుడు (నాజర్). ఇద్దరు కొడుకులు బోస్ (జగపతి బాబు), జగదీష్ (నాని).. ఇద్దరు కూతుళ్లతో ఆ ఫ్యామిలీ సంతోషంగా ఉంటారు. ఊళ్లో భూపతి కుటుంబం చేసే అక్రమాలను ఎదురిస్తూ పేద ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తాడు ఆది శేషగిరి నాయుడు. అయితే ఆ ఊళ్లోకి ఏ ఎం.ఆర్.ఓ వచ్చినా అతన్ని బెదిరించి.. చంపి వాళ్ల పనిఉలు చేసుకుంటారు. ఈ క్రమంలో ఆదిశేషగిరి మరణంతో ఆయన కుటుంబం కూడా చిన్నాభిన్నం అవుతుంది. జగదీష్ కు విషయం తెలిసి ఊళ్లో ఎంట్రీ ఇస్తాడు. జగదీష్ ఊళ్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు..? ఊరి గొడవలను టక్ జగదీష్ ఎలా సాల్వ్ చేశాడు.. అన్నది సినిమా కథ. 

విశ్లేషణ :

ఓ పద్ద కుటుంబం.. ఆ కుటుంబానికి పెద్ద మనిషి.. ఊరికి ఆయనే అండ.. ఆయన చనిపోతే ఇంట్లో గొడవలు.. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. కథ రొటీన్ గా అనిపిస్తుంది. అయితే కథనం ఏదైనా కొత్తగా ఉందా అంటే అది కూడా రొటీన్ గానే సాగించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కొద్దిగా ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది.

సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్ లో బలమైన సందర్భం ఉన్నా ఎందుకో ఆడియెన్స్ మనసుని కదిలించేలా సీన్స్ పండలేదని చెప్పొచ్చు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లు కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. నిన్ను కోరి, మజిలీ సినిమాలు తీసి హిట్ అందుకున్న శివ నిర్వాణ మీద నాని పూర్తిగా నమ్మకం పెట్టి ఈ సినిమాను చేసినట్టు ఉన్నాడు. అందుకే సినిమా అవుట్ పుట్ మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదన్నట్టు అనిపిస్తుంది.

హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కామెడీ పెద్దగా లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నా అవి అక్కడక్కడ మెప్పించాయి. 

నటన, సాంకేతికవర్గం :

టక్ జగదీష్ పాత్రలో నాని తన మార్క్ చూపించాలని ప్రయత్నించాడు. సినిమా కథ, కథనాలు తప్ప నాని తన వరకు బాగానే మెప్పించాడు. హీరోయిన్ రీతు వర్మ జస్ట్ ఓకే. ఐశ్వర్యా రాజేష్ తన పాత్ర వరకు బాగా చేసింది. జగపతి బాబు బోస్ బాబు పాత్రలో జస్ట్ ఓకే అనిపించాడు. ఆయన్ను డైరక్టర్ సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. విలన్ వీరేంద్ర నాయుడు పాత్రలో డానియల్ బాలాజి పర్వాలేదు అనిపించాడు. రావు రమేష్, నరేష్, నాజర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. థమన్ మ్యూజిక్ పాటల్లో రెండు బాగున్నాయి. గోపీ సుందరం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ప్రసాద్ మూరెళ్ల పల్లెటూరి అందాలను బాగానే చూపించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. డైరక్టర్ శివ నిర్వాణ రాసుకున్న కథ ప్రకారం ఎమోషన్స్ ను పండించడంలో ఫెయిల్ అయ్యాడు. టేకింగ్ వరకు ఓకే కాని స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుంటే బాగుండేది. 

ఒక్కమాటలో :

టక్ జగదీష్.. జస్ట్ టైం పాస్..!

రేటింగ్ : 2.5/5

Related Post