‘సంతాన ప్రాప్తిరస్తు’ ఆశీర్వాదం కాదు సినిమా పేరు!

May 08, 2025


img

నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా చేసిన సినిమా పేరు ‘సంతాన ప్రాప్తిరస్తు.’ ఈ సినిమా నుంచి నాలో ఏదో అంటూ సాగే పాట శుక్రవారం విడుదల చేశారు. శ్రీజో వ్రాసిన ఈ పాటకి సునీల్ కాశ్యప్ సంగీతం అందించగా అదితి భావరాజు మృధు మధురంగా పాడారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్, డైలాగ్స్: కళ్యాణ్ రాఘవ్, సంగీతం: సునీల్ కాశ్యప్, కొరియోగ్రఫీ: లక్ష్మణ్ కాళహస్తి, స్టంట్స్: జీవన్ కుమార్‌, కెమెరా: మహిరెడ్డి పండుగుల, ఎడిటింగ్: సాయి కృష్ణ గానల చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.          


Related Post

సినిమా స‌మీక్ష