కధ ముఖ్యం దర్శకుడి ట్రాక్ రికార్డ్ కాదు!

April 16, 2025


img

నేటి సినీ దర్శక నిర్మాతలలో చాలామంది పెద్ద హీరోతో భారీ బడ్జెట్‌ పెట్టి పాన్ ఇండియా మూవీ ఎలా తీసిన హిట్ అయిపోతుందనే భ్రమలో ఉన్నారు. కానీ తనకు దర్శకుడి ట్రాక్ రికార్డ్ కంటే కధే ముఖ్యమని కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతి స్పష్టం చేశారు.

వరుసగా ఫ్లాప్ సినిమాలతో ఎదురుదెబ్బలు తింటున్న పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వరుస హిట్స్ కొడుతున్న విజయ్ సేతుపతి ఒప్పుకోవడాన్ని తప్పు పడుతూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.

అవి ఆయన దృష్టికి రావడంతో స్పందిస్తూ, “గతంలో పూరీ చేసిన సినిమాలను చూసి ఆయన ఓ గొప్ప దర్శకుడు కనుక నేను ఈ సినిమా చేయడం లేదు. ఆయన చెప్పిన కధలో బలం ఉందని నమ్మకం కలిగింది. అది నాకు బాగా సూట్ అవుతుందని నమ్మాను. బలమైన కధ ఉన్న సినిమాలు చేయడమే నా బలం. అందుకే పూరీతో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. మా సినిమా షూటింగ్‌ ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభిస్తాము,” అని విజయ్  సేతుపతి చెప్పారు. 

ఈ సినిమాలో తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన బాలీవుడ్‌ నటి టబు ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. దీనిని పూరీ, ఛార్మీల సొంత బ్యానర్ ‘పూరీ కనెక్ట్స్’ ఈ సినిమాని 5 భాషలలొ పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష