తెలుగు సినిమాలకు ఫిలిం ఛాంబర్ అవార్డులు

February 07, 2025


img

సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వం ఏటా ఉత్తమ చిత్రాలకు నంది అవార్డులు ప్రధానం చేసేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత రెండు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆ కార్యక్రమం నిలిచిపోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏటా ఉగాది పండుగ రోజున గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. అందుకు సినీ ప్రముఖులు కూడా సానుకూలంగా స్పందించారు. 

కానీ తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా ఏటా ఫిబ్రవరి 6న అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. తెలుగులో తొలి సినిమా భక్త ప్రహ్లాద 1932, ఫిబ్రవరి 6న విడుదలైనందున ఆ రోజున తెలుగు సినిమా పుట్టినరోజుగా భావించి అవార్డులు అందజేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. ఈ కార్యక్రమం కోసం సినీ పరిశ్రమ ప్రత్యేకంగా ఓ జెండా కూడా రూపొందిస్తోంది. ఈ బాధ్యతని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణకి అప్పగించారు. 

పదేళ్ళ ఏళ్ళ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏటా ఉగాది రోజున గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించి దీని కోసం కమిటీని కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఫిలిం ఛాంబర్ హటాత్తుగా ఈ అవార్డుల కార్యక్రమం ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే గద్దర్ అవార్డుల కార్యక్రమంలో కూడా సినీ పరిశ్రమ పాల్గొని విజయవంతం చేస్తుందని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. దీనిపై ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు ఇంకా స్పందించాల్సి ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష