రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో శివకార్తీకేయన్, సాయి పల్లవి జంటగా చేసిన పాన్ ఇండియా మూవీ అమరన్ థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది. కనుక ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కూడా మట్కాతో పాటు డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. అదే రోజు నుంచి తెలుగు, తమిళ్, కన్నడ మలయాళం, హిందీ భాషలలో ప్రసారం అవుతుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
2014 లో జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాడులతో పోరాడుతూ అమరుడైన మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత గాధని అమరన్ సినిమాగా తెరకెక్కించారు. కధేమిటంటే, ఎప్పటికైనా ఆర్మీలో చేరాలని పట్టుదలగా ప్రయత్నించిన హీరో, కాలేజీ రోజుల్లో హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. ఆర్మీ ట్రైనింగ్ తర్వాత ఆర్మీలో లెఫ్టినెంట్‌గా చేరుతాడు.
ఓ పక్క హీరో హీరోయిన్ల ప్రేమ, పెళ్ళి సమస్యలు, మరోపక్క ఆర్మీలో క్లిష్టమైన ఆపరేషన్స్ చేపడుతుండటం రెంటినీ దర్శకుడు చాలా జాగ్రత్తగా బ్యాలన్స్ చేస్తూ యాక్షన్, భావోద్వేగాలు రెండూ చక్కగా తెరకెక్కించగలిగారు. అందువల్లీ ఇది అందరికీ తెలిసిన కధే అయినా తర్వాత ఏం జరుగబోతోందో తెలుస్తున్నా ప్రేక్షకులను మెప్పించగలిగింది.