మోక్షజ్ఞ ఎంట్రీ ఆ డైరెక్టర్ తోనేనా..?

January 23, 2021


img

నందమూరి నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం కోట్లాది అభిమానులు ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఫై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బాలయ్య సైతం పలువురు అగ్ర దర్శకులతో చర్చలు జరుపుతూనే వస్తున్నారు. బాలకృష్ణ 100వ మూవీ గౌతమి పుత్ర శాతకర్ణిలోనే మోక్షజ్ఞ తో ఓ గెస్ట్ రోల్ చేయిస్తారని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. దాంతో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. గతంలో బోయపాటి బాలకృష్ణ కలయికలో వచ్చిన సింహ , లెజెండ్ సినిమాలు భారీ హిట్ అందుకున్నాయి. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని  అంటున్నారు.

ఈ మూవీ పూర్తయిన తరువాత మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ను పూరి చేతిలో పెట్టాలని బాలకృష్ణ భావిస్తున్నాడట. రీసెంట్ గా పూరీ స్క్రిప్ట్ రెడీ చేసి బాలయ్య కు వినిపించాడట. ఆ స్క్రిప్ట్ విని బాలకృష్ణ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాను ప్రకటిస్తారని సమాచారం.  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ను చిరుత సినిమాకు పూరి దర్శకత్వం వహించారు. ఎంట్రీ అద్భుతంగా ఉండటంతో.. చరణ్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ లిస్ట్ లో ఉన్నాడు.  మోక్షజ్ఞను కూడా పూరితో లాంచ్ చేయిస్తే బాగుంటుందని బాలయ్య ఫిక్స్ అయ్యాడట.  పూరీ జగన్నాథ్ బాలయ్యతో పైసా వసూల్ , ఎన్టీఆర్ తో టెంపర్, కళ్యాణ్ రామ్ తో ఇజం వంటి సినిమాలు చేసాడు.  మోక్షజ్ఞ ను కూడా పూరీ డైరెక్ట్ చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారట. ఈ మధ్యనే ఇస్మార్ట్ శంకర్ తో పూరి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా చేస్తున్నాడు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ పూరీతోనా కాదా అన్నది త్వరలో తెలుస్తుంది.


Related Post

సినిమా స‌మీక్ష