పవర్ స్టార్ ఫ్యాన్స్ సిద్ధమా.. వకీల్ సాబ్ టీజర్ ఎప్పుడంటే..!

January 07, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని చేసిన సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేశారు. ఈమధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ అయ్యింది. పవర్ స్టార్ టీజర్ కోసం ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ రోజు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు పవన్ కళ్యాణ్.

పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ టీజర్ ను ఈ నెల 14న సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ ఫిక్స్ చేశారు. పవర్ స్టార్ సినిమా టీజర్ హంగామా ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఇలా టీజర్ రిలీజ్ అవడమే ఆలస్యం అలా ట్విట్టర్ లో ట్రెండ్ చేసి యూట్యూబ్ లో నిమిషాల్లో మిలియన్ వ్యూస్ రాబట్టి పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు. ఇప్పటివరకు వకీల్ సాబ్ నుండి పోస్టర్స్ మాత్రమే రాగా ఫస్ట్ లుక్ టీజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మగువా సాంగ్ ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యింది. ఈ ఇయర్ సమ్మర్ లో వకీల్ సాబ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష