KGF చాప్టర్ 2 టీజర్ ఎప్పుడంటే..!

December 03, 2020


img

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమా కె.జి.ఎఫ్. కన్నడ సిని చరిత్రలో కె.జి.ఎఫ్ సరికొత్త సంచలనాలు సృష్టించింది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కిన కె.జి.ఎఫ్ సినిమాతో హీరోగా యశ్, డైరక్టర్ గా ప్రశాంత్ నీల్ కు సూపర్ క్రేజ్ వచ్చేలా చేసింది. ఇక ఈ సినిమా సీక్వల్ గా వస్తున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. 

సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా టీజర్ ను 2021 జనవరి 8న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా టీజర్ యశ్ బర్త్ డే సందర్భంగా ఆరోజున రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ సినిమా కన్నా భారీ రేంజ్ లో పార్ట్ 2 వస్తుందని తెలుస్తుంది. సినిమాలో చాలా సర్ ప్రైజులు ప్లాన్ చేశాడట డైరక్టర్. మరి పార్ట్ 2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

 


Related Post

సినిమా స‌మీక్ష