మహేష్ వర్సెస్ అల్లు అర్జున్

May 22, 2019


img

సూపర్ స్టర్ మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ ఫైట్ త్వరలో చూడబోతున్నావ్.. వారిద్దరు పోటీపడే సందర్భం ఏంటనుకోవచ్చు. 2020 సంక్రాంతికి వారి సినిమాలు పోటీ పడనున్నాయి. మహర్షి తర్వాత మహేష్ అనీల్ రావిపుడి సినిమా కన్ఫాం చేశాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. జూన్ సెకండ్ వీక్ లో మొదలవనున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది. రెడ్డి గారి అబ్బాయి టైటిల్ తో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో అనీల్ రావిపుడి మార్క్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ తో సినిమా ఉంటుందట.

ఇక ఈ సినిమాతో పాటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి పోటీలో దిగుతుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది. మరోసారి తండ్రి కొడుకుల సెంటిమెంట్ కథతో త్రివిక్రం బన్ని సినిమా వస్తుందట. ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతుంది. 

మహేష్ తో బన్ని టఫ్ ఫైట్ జరుగనుంది. సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా పండుగ రోజులు కాబట్టి ఆడేస్తాయి. మరి మహేష్ అనీల్ క్రేజీ కాంబో కాగా.. త్రివిక్రం, బన్ని సూపర్ హిట్ కాంబో ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.  



Related Post

సినిమా స‌మీక్ష