ఒకే టైటిల్ తో రెండు సినిమాలు..!

April 16, 2019


img

దర్శకధీరుడు రాజమౌళి తనయుడు జక్కన్న సినిమాల్లో సెకండ్ యూనిట్ డైరక్టర్ గా ఉంటున్నాడు. అయితే ఈమధ్య అతను సినిమా నిర్మాణంలోకి దిగాడు కార్తికేయ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఆకాశవాణి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు షాక్ ఇస్తూ అదే టైటిల్ తో మరో సినిమా వస్తుంది. అయితే ఆ రెండో సినిమా టైటిల్ పేరు ఏంటంటే ఆకాశవాణి విషాఖపట్టణ కేంద్రం అని పెట్టారు.

సతీష్ బత్తుల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మల్లిఖార్జున నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ సినిమా టీజర్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. రెండు సినిమాలు ఇంచుమించు ఒకే టైటిల్ తో రావడం పట్ల ఆడియెన్స్ కన్ ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కార్తికేయ తీస్తున్న ఆకాశవాణి ఎలా ఉంటుందో తెలియదు కాని సతీష్ బత్తుల ఆకాశవాణి పోస్టర్ లో మాత్రం నాకు ఒక ప్రాబ్లం ఉంది అదేంటో మీకు సభాముఖంగా చెప్పబోతున్నాను అంటూ షాడో థీం తో వచ్చింది. మరి ఇందులో ఆడియెన్స్ లో ఏ సినిమా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష