సెక్స్ రాకెట్ పై స్పందించిన అనసూయ, శ్రీరెడ్డి..!

June 16, 2018


img

అమెరికాలో జరిగిన సెక్స్ రాకెట్ పై సినిమా పరిశ్రమ వేడెక్కింది. అక్కడకెళ్లి మరి పరిశ్రమ పరువు తీస్తున్నారని మా అసోషియేషన్ సీరియస్ గా ఉంది. పక్కా ఆధారాలు ఉండటంతో కిషన్, చంద్రలతో కలిసి ఈ బాగోతం నడిపించిన కథానాయికలకు కష్టాలు తప్పేలా లేవు. ఇక ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్స్ ఈ నెల 24న మీటింగ్ ఏర్పాటుచేశారు. ఇక నుండి సెలబ్రిటీస్ ఎవరు విదేశాలకు వెళ్లినా వారు పాల్గొనే కార్యక్రమాల వివరాలు తమకు తెలపాలని అన్నారు. 

ఇక ఈ సెక్స్ రాకెట్ పై మొదట నోరు విప్పింది యాంకర్ అనసూయ. 2014లో తాను మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో ఓ ఈవెంట్ కు అటెండ్ అయ్యానని. 2016లో అమెరికా నెంబర్ తోనే శ్రీరాజ్ తనని తెలుగు అసోషియేషన్ నిర్వహించే సభలకు హాజరు కావాలని ఆహ్వానించారని కాని అతని మాట్లాడే ప్రవర్తన నచ్చక వెళ్లలేదని అన్నది అనసూయ.

ఇక కాస్టింగ్ కౌచ్ మీద యుద్ధం చేసిన శ్రీరెడ్డి సైతం చికాగో సెక్స్ రాకెట్ మీద స్పందించింది. అవకాశాల్లేని హీరోయిన్స్ అమెరికాకు ఈవెంట్స్ పేరుతో రప్పించి వారిని మభ్యపెట్టి వ్య్భిచారం చేయిస్తున్నారని అన్నది. అలా వెళ్లిన వారికి 1000 డాలర్ల నుండి ఆఫర్ చేస్తారట. సెలబ్రిటీస్ పాపులారిటీ బట్టి వారి రేటు ఉంటుందని అన్నది శ్రీరెడ్డి. తనకు ఆ ఆఫర్ వచ్చిందని చెప్పింది. 

చూస్తుంటే ఇష్యూ చాలా పెద్దదిగా మారబోతున్నట్టు తెలుస్తుంది. వ్యవహారం బట్టబయలు అయితే ఇప్పుడు ఎవరైతే క్రేజ్ తో పాపులారిటీ సంపాదించిన హీరోయిన్స్ ఉన్నారో వారి కెరియర్ కు ఎండ్ కార్డ్ పడ్డట్టే మరి.  



Related Post

సినిమా స‌మీక్ష