మల్టీస్టారర్ లో రకుల్.. లక్కీ ఛాన్స్..!

May 19, 2018


img

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఓ రెండేళ్లుగా సూపర్ ఫాంలో ఉండగా ఈ ఇయర్ అంతగా కలిసి రాలేదని చెప్పాలి. స్పైడర్ తర్వాత తెలుగులో సినిమాలేవి లేకపొవడంతో కోలీవుడ్ పై దృష్టి పెట్టింది ఈ అమ్మడు. అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మళ్లీ ఓ క్రేజీ ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.

అది కూడా ఓ భారీ మల్టీస్టారర్ లో అవకాశం దక్కించుకుందని టాక్. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోగా జై లవ కుశ డైరక్టర్ కె.ఎస్ రవింద్ర డైరక్షన్ లో మల్టీస్టారర్ సినిమా రాబోతుంది. ఆ సినిమాలో నాగ చైతన్య సరసన రకుల్ జోడి కట్టబోతుందట. ఆల్రెడీ ఈ ఇద్దరు రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో కలిసి నటించారు. మళ్లీ ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం కలిసి చేస్తున్నారు. మరోపక్క వెంకటేష్ వరుణ్ తేజ్ తో కూడా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే సినిమా చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష