తిరుపతి ఆలయ గోపురంపై మందుబాబు హల్ చల్!

January 03, 2026


img

మద్యంమత్తులో ఓ వ్యక్తి తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోకి ప్రవేశించి రాజగోపురంపైకి ఎక్కి చాలా హంగామా చేశాడు. బుధవారం రాత్రి స్వామివారి ఏకాంతసేవ ముగిసిన తర్వాత ఓ వ్యక్తి గోడ దూకి లోనికి ప్రవేశించాడు. భద్రతా సిబ్బంది చూసి పట్టుకునేలోగానే దాదాపు 30-40 అడుగులు ఎత్తున గోపురంపైకి చకచకా ఎక్కేశాడు. గోపురంపై ఉన్న కలశాలు పెకిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. 

భద్రతా సిబ్బంది అతనిని వారిస్తున్నప్పటికీ వినకుండా మద్యం మత్తులో నానా హంగామా చేశాడు. చివరికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి నిచ్చెనల సాయంతో గోపురంపైకి చేరుకొని అతనిని భద్రంగా క్రిందకు దించారు. 

ఆలయ నిర్వాహకులు పిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకొని అతనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అతని పేరు తిరుపతి. నిజామాబాద్ జిక్లా కూర్మవాడ పెద్ద మల్లారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. 

అతను మద్యం మత్తు నుంచి తేరుకున్నాక మరోసారి ప్రశ్నించి నిజం తెలుసుకుంటామని తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం చెప్పారు.


Related Post