యశోదలో కేసీఆర్‌.. నిలకడగా ఆరోగ్య పరిస్థితి

July 04, 2025


img

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకి గురి కావడంతో సోమాజీగూడలోణి యశోద హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు జరిపిన తర్వాత ఆరోగ్య పరిస్థితిపై యశోద హాస్పిటల్‌ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

ఆయనకు బ్లడ్ షుగర్ ఎక్కువగా ఎక్కువగా ఉందని, సోడియం లెవెల్  తక్కువగా ఉందని దానిలో పేర్కొన్నారు. కనుక దానికి తగిన చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం ఆయన నీరసంగా ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. 

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి యశోద హాస్పిటల్‌ వైద్యులకు ఫోన్‌ చేసి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కొలుకునేందుకు అత్యుత్తమ చికిత్స అందించాలని కోరారు. 



Related Post