తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తాజా సమాచారం. అయితే మొత్తం ఆరు పదవులు భర్తీ చేయాల్సి ఉండగా నాలుగు పదవులకు మాత్రమే అనుమతించి, ఇప్పటికే పేర్లు కూడా ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఇంతవరకు నాకు ఢిల్లీ నుంచి ఫోన్ రాలేదు కానీ నాకు హోంమంత్రి పదవిపై దక్కుతుందని భావిస్తున్నాను. వేరే శాఖ లభించినా అభ్యంతరం చెప్పకుండా స్వీకరించి సమర్ధంగా పనిచేస్తాను,” అని అన్నారు.
ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. కనుక ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి కూడా పదవి ఇస్తే దాని కోసం ప్రయత్నించి భంగపడిన సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి చెందవచ్చు. తనకు తప్పనిసరిగా మంత్రిపదవి ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి పట్టుబడుతున్నారు. కనుక ఒకవేళ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. సీనియర్లతో ఇటువంటి సమస్యలు వస్తాయనే భయంతోనే ఇంతకాలం ఆరు మంత్రి పదవులు భర్తీ చేయకుండా ఉంచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 15 నెలలు. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా అయింకా అట్టే బెడితే పార్టీలో అసంతృప్తి క్రమంగా పెరుగుతుంది. కనుక మంత్రివర్గ విస్తరణ అంటే ముందు నవయ్యి వెనుక గొయ్యి అన్నట్లే మారింది.