ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపి భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి రాబోతోంది. మొత్తం 70 స్థానాలకు బీజేపి 21 సీట్లు గెలుచుకొని మరో 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుకి 37 సీట్లు అవసరం కాగా బీజేపి 51 సీట్లు గెలుచుకొని సుమారు 27 ఏళ్ళ తత మళ్ళీ అధికారంలోకి రాబోతోంది.
ఇక ఈ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీతో పాటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇద్దరూ ఓడిపోయారు. అయితే ముఖ్యమంత్రి అతీశీ సమీప బీజేపి ప్రత్యర్ధి రమేష్ బిధూరిపై స్వల్ప తేడాతో విజయం సాధించారు.
ఈ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీకి 9 స్థానాలు గెలుచుకొని మరో 10 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది కనుక మొత్తం 19 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎగ్జిట్ పోల్స్ జోస్యం నిజమైంది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలపడింది.