ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్‌లో కుంభమేళాలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టర్ 19 వద్ద ఏర్పాటు చేసిన గూడారాలలో ఒకదానిలో ఒకేసారి రెండు గ్యాస్ సిలిండర్లు పెద్ద శబద్ధంతో పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి చుట్టుపక్కల గుడారాలకు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో 18 గుడారాలు, వాటిలో ఉండే పరుపులు, భక్తుల దుస్తులు, బ్యాగులు అన్నీ కాలి బూడిదైపోయాయి.
అయితే ఇటువంటి అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు యూపీ ప్రభుత్వం ముందుగానే ఎక్కడికక్కడ అగ్నిమాపక వాహనాలు, సిబ్బందిని సిద్దంగా ఉంచినందున వారు వెంటనే అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు.
ఈ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరుగలేదని కుంభమేళా అధికారులు చెపుతున్నప్పటికీ ఆ స్థాయిలో గ్యాస్ సిలిండర్ విస్పోటనం జరిగి 18 గూడారాలు అగ్నికి ఆహుతి అయినందున ప్రాణ నష్టం జరిగే ఉండవచ్చు. ఈ అగ్ని ప్రమాదం విషయం తెలుసుకొని ప్రధాని మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాద్‌కి ఫోన్ చేసి వివరాలు కనుగొన్నారు. కుంభమేళా ప్రత్యేక అధికారులు, డీఐజీ వైభవ్ కృష్ణ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.