బిజేపి ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే

January 11, 2025


img

త్వరలో తెలంగాణలో మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ముందుగా మూడు స్థానాలకు బీజేపి తమ అభ్యర్ధులను ప్రకటించింది. వారి వివరాలు: 

కరీంనగర్-నిజామాబాద్‌-అదిలాబాద్-మెదక్ (పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి): సి.అంజిరెడ్డి

కరీంనగర్-నిజామాబాద్‌-అదిలాబాద్-మెదక్ (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి): మల్క కొమురయ్య 

నల్గొండ-వరంగల్-ఖమ్మం (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి): పులి సరోత్తమ్ రెడ్డి. 

ఈ ముగ్గురు అభ్యర్ధులను బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతితో ఖరారు చేశామని కేంద్ర మంత్రి, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తెలిపారు. 

పీసీసీ అధ్యక్షుడు మహేష్ బాబు కుమార్‌ గౌడ్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని తెలిపారు. వారిలో అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్‌ నరేందర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందని తెలిపారు.


Related Post