ఫార్ములా 1 రేసింగ్ కేసులో హైకోర్టులో కేటీఆర్‌కి ఎదురుదెబ్బ తగిలడంపై ముందుగా సీనియర్ నాయకుడు హరీష్ రావు స్పందించారు.
ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఫార్ములా 1 రేసింగ్ ఈవెంట్ నిర్వహించడం కోసం దేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కానీ కేటీఆర్ చొరవ తీసుకొని హైదరాబాద్‌లో జరిగేలా చేశారు. దాని వలన హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగింది. ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడా లభించింది. ఈ కేసులో గ్రీన్ కంపెనీకి ఎటువంటి అదనపు ప్రయోజనం కలగలేదు.
కేటీఆర్ కూడా అవినీతికి పాల్పడలేదు. హైకోర్టు ఈ కేసు విచారణ జరిపించవచ్చని చెప్పింది తప్ప కేటీఆర్ తప్పు చేశారని చెప్పలేదు. కానీ కాంగ్రెస్ నేతలు హైకోర్టు తీర్పుని వక్రీకరిస్తూ కేటీఆర్ తప్పు చేశారని, త్వరలోనే జైలుకి వెళ్ళక తప్పదని దుష్ప్రచారం చేస్తున్నారు.
మాకు కోర్టులు, కేసులు, అరెస్టులు కొత్తకాదు. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని చూపి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేద్దామనుకుంటే ఎవరూ భయపడరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫ్యల్యాలను, హామీలు అమలుచేయకుండా తప్పించుకునే ప్రయత్నాలను మేము గట్టిగా నిలదీస్తూనే ఉంటాము.
మేము ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందునే మాపై ఇటువంటి టప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. హైకోర్టు తీర్పు కాపీ మాకు అందిన తర్వాత దానిని బట్టి మా న్యాయవాదులు తదుపరి కార్యాచరణ చేపడుతారు.
మేము న్యాయస్థానాలను గౌరవిస్తాం. ఏసీబీ మళ్ళీ విచారణకు పిలిస్తే కేటీఆర్ తప్పకుండా హాజరవుతారు. ఒకవేళ ఈ కేసులో ఆయన అరెస్ట్ అయినప్పటికీ కడిగిన ఆణి ముత్యంలా బయటకు వస్తారు,” అని హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, మోసాలపై ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకే కేటీఆర్ గారిపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న రేవంత్.
— BRS Party (@BRSparty) January 7, 2025
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/GBkT6Qtqqb
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా..
— BRS Party (@BRSparty) January 7, 2025
తెలంగాణ ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటం ఆగదు.
రేవంత్ సర్కార్ అక్రమాలు, వైఫల్యాలను బయట పెడుతూనే ఉంటాం.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/VT3WlIva4C