వర్మ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయా?

November 27, 2024


img

దర్శకుడు రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తుండటంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఓ వీడియో విడుదల చేశారు. దానిలో ఆయన ఏమన్నారంటే, “ఏడాది క్రితం నేను ఎవరినో ఉద్దేశించి ట్వీట్స్ చేస్తే ఇప్పుడు ఒకేసమయంలో వేర్వేరు ప్రాంతాలలో ఉన్న ఇతరుల మనోభావాలు దెబ్బ తిన్నాయా?

నేను ఎవరిని విమర్శించానో  వారు స్పందించలేదు కానీ ఆ విమర్శలకు ఇతరుల మనోభావాలు దెబ్బ తిన్నాయట.. అందుకు పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటికి సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి?

రాజకీయ ఒత్తిళ్ళు కారణంగానే నాపై ఈ కేసులు నమోదైన్నట్లు భావిస్తున్నాను. లేకుంటే ఏడాది తర్వాత నాపై ఒకేసారి ఇన్ని కేసులు నమోదు చేసి వారం రోజులలోనే నన్ను అరెస్ట్ చేసేయాలని పోలీసులు ఎందుకు ఆరాటపడుతున్నారు? హత్య కేసులలో చర్యలు తీసుకోవడానికి సంవత్సరాలు తీసుకుంటారు. కానీ నా కేసు అంతకంటే ముఖ్యమైనదా? ఇంత అత్యవసరంగా విచారణ చేసి నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? 

ప్రస్తుతం నేను ఓ సినిమా షూటింగులో బిజీగా ఉన్నానని కనుక విచారణకు హాజరయ్యేందుకు కాస్త సమయం ఇమ్మనమని కోరాను తప్ప ఎక్కడికీ పారిపోలేదు. షూటింగ్ నిలిచిపోతే నిర్మాతకు నష్టం కలుగుతుందనే నేను విచారణకు హాజరు కాలేదు తప్ప కేసులకి భయపడికాదు,” అంటూ రాంగోపాల్ వర్మ ఓ పెద్ద వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు.


Related Post