తమిళసై తమిళనాడు వెళ్ళిపోయినా బిఆర్ఎస్‌ని దెబ్బేస్తున్నారే!

April 18, 2024


img

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళసై లోక్‌సభ ఎన్నికలలో తన స్వరాష్ట్రం తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు పదవికి రాజీనామా చేసి మళ్ళీ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె తమిళనాడు వెళ్ళిపోయినా తన పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించిన కేసీఆర్‌, బిఆర్ఎస్‌ ప్రభుత్వంపై పగ తీర్చుకుంటూనే ఉన్నారు. 

ఇటీవల ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నేను తెలంగాణ గవర్నర్‌గా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాపింగ్‌ చేస్తున్నారని గుర్తించి ఫిర్యాదు చేశాను. కానీ అప్పటి బిఆర్ఎస్‌ ప్రభుత్వం నావి రాజకీయ ఆరోపణలంటూ తేలికగా కొట్టి పడేసింది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం బయటపడిన తర్వాత ఆనాడు నేను చేసిన ఆరోపణలు నిజమే అని రుజువు అయ్యింది.

ఫోన్ ట్యాపింగ్‌ కేసుని సీబీఐ చేత నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే దాని వెనుక సూత్రధారులను బయటపెట్టగలదు,” అని తమిళసై సౌందర్ తమిళిసై సౌందర్ రాజన్‌ అన్నారు.

ఆమె తమిళనాడులో ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, కీలకమైన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ ఆరోపణలు చేసినందున, బిఆర్ఎస్‌ పార్టీని వేలెత్తిచూపిన్నట్లయ్యింది. కనుక రాష్ట్ర బీజేపీ నేతలు ఆమె మాటలను హైలైట్ చేసి ప్రచారం చేసుకుంటే బిఆర్ఎస్‌ పార్టీ నష్టపోతుంది.


Related Post