ఈటల చొరవతో హరీష్‌ మంచి నిర్ణయం

October 16, 2019


img

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఇటీవల ప్రభుత్వాసుపత్రులను పరిశీలించడానికి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా వైద్యఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆయనను కలిసి తమకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకొన్నారు.  ఆయన వెంటనే స్పందించి రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావుతో దీని గురించి మాట్లాదారు. హరీష్‌రావు కూడా వెంటనే సానుకూలంగా స్పందిస్తూ ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న 1.20 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతీనెల తంచనుగా 7 వ తేదీన జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల నుంచే దీనిని అమలుచేసే అవకాశం ఉంది. ప్రజాసమస్యల పట్ల స్పందించడం అంటే ఇదే కదా?



Related Post