కాంగ్రెస్ అధిష్టానం కొద్ది సేపటి క్రితమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 13 మందితో కూడిన 3వ జాబితాను విడుదల చేసింది. దీంతో కలిపి మొత్తం 88 మంది అభ్యర్ధులను ఖరారు చేసినట్లయింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగియబోతోంది కనుక ఆలోగా మిగిలిన 6 మంది అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించవలసి ఉంటుంది. టిడిపి కూడా సనత్ నగర్ నియోజకవర్గానికి కూన వెంకటేష్ గౌడ్ ను అభ్యర్ధిగా ప్రకటించింది ఈరోజు ప్రకటించిన అభ్యర్ధుల వివరాలు:
జనగామ: పొన్నాల లక్ష్మయ్య
తుంగతుర్తి: అడ్డంకి దయాకర్
ఎల్బీ నగర్: సుధీర్ రెడ్డి
కార్వాన్: ఉస్మాన్ బిన్ హజారీ
బహదూర్ పురా: కాలెం బాబా
యాకుత్ పురా: రాజేందర్ రాజు
కొల్లాపూర్: హర్షవర్ధన్ రెడ్డి
దేవరకొండ: బాలూ నాయక్
బాల్కొండ: ఈర్రవతి అనిల్ కుమార్
నిజామాబాధ్ రూరల్: రేకుల భూపతి రెడ్డి
నిజామాబాద్ అర్బన్: తాహెర్ బిన్ హుందాన్
భోధ్: సోయమ్ బాపూరావు