రాహుల్...వాటీజ్ దిస్?

July 20, 2018


img

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ్ళ తన స్వంతపార్టీ సభ్యులతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, అధికార పార్టీ సభ్యులకు కూడా పెద్ద షాక్ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీని తీవ్రంగా విమర్శించారు. నోట్లరద్దు మొదలు జి.ఎస్.టి. నల్లధనం వెలికితీత, రాఫెల్ యుద్దవిమానాల కుంభకోణం వరకు ప్రతీ అంశాన్ని ప్రస్తావిస్తూ మోడీ దేశాన్ని అన్నివిధాల భ్రష్టుపట్టించారని తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తొందరపాటు, తెలివి తక్కువ నిర్ణయాల వలణ దేశంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయని విమర్శించారు. తన ప్రసంగం ముగించిన తరువాత నేరుగా ప్రధాని నరేంద్రమోడీ సీటు వద్దకు వెళ్లి ఆయనను కౌగలించుకొన్నారు. రాహుల్ గాంధీ తన వద్దకు రావడం చూసి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నరేంద్ర మోడీ చెయ్యి అందించబోతే, సున్నితంగా అయన చేతిని పక్కకు త్రోసి గాడంగా కౌగలించుకొన్నారు. అది చూసి ప్రధాని నరేంద్రమోడీతో సహా లోక్ సభలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. సుమారు గంటసేపు తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టిపోసిన తరువాత వచ్చి కౌగలించుకోవడం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. మోడీతో సహా అందరూ నవ్వుతూ చూస్తుండిపోయారు. ఆ అయోమయంలోనే అధికార, ప్రతిపక్షసభ్యులు బల్లలపై చరిచి తమ హర్షం వ్యక్తం చేశారు. ఇంతకీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని ఎందుకు కౌగలించుకొన్నారో? 


Related Post