తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల ప్రాధమిక కీ విడుదల

May 22, 2023
img

తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పరీక్షలకు సంబందించి ప్రాధమిక ‘కీ’ని పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ఇది సోమవారం ఉదయం నుంచి నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.in లో అభ్యర్ధులకు అందుబాటులో ఉంటుంది. దీనిలో ప్రశ్నలకు సంబందించి అభ్యర్ధులకు ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే ఒక్కో దానిని వేర్వేరుగా అదే వెబ్‌సైట్‌లో తెలియజేయవచ్చు. తమ అభ్యంతరాలను ధృవీకరించేందుకు తగిన ఆధారాలను కూడా దానిలోనే అప్‌లోడ్‌ చేయవచ్చు. బుదవారం వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని పోలీస్ నియామక మండలి తెలియజేసింది. 

పోలీస్ నియామక మండలి గత నెల 30న పోలీస్ కానిస్టేబుల్స్, డ్రైవర్లు, మెకానిక్‌లు తదితర సమాన స్థాయి ఉద్యోగాల భర్తీకి తుది పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 16,614 పోస్టులకు 2022, మే నెలలో నోటిఫికేషన్‌ జారీ చేయగా సుమారు 6 లక్షలమందికి పైగా దరఖాస్తు చేసుకొన్నారు. భౌతిక పరీక్షలు, ప్రాధమిక రాత పరీక్షలలో 1,14,209 మంది తుది పరీక్షలకు అర్హత సాధించారు.

Related Post