మరో 2,391 ఉద్యోగాల భర్తీకి అనుమతి: హరీష్‌ రావు

January 27, 2023
img

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జాతర కొనసాగుతూనే ఉంది. ఈరోజు మరో 2,391 ఉద్యోగాల భర్తీ రాష్ట్ర ఆర్ధికశాఖ అనుమతి మంజూరు చేసిందని ఆ శాఖ మంత్రి హరీష్‌ రావు తెలియజేశారు. వాటికి సంబందించిన వివరాలను సోషల్ మీడియాలో ఆయనే స్వయంగా పోస్ట్ చేశారు. ఈ ఉద్యోగాలని టిఎస్‌పీఎస్సీ, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్‌ బోర్డు, మెడికల్ అండ్ ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ సర్వీసస్ బోర్డ్ ద్వారా భర్తీ చేయబడతాయని తెలిపారు. 

త్వరలో వెలువడబోయే నోటిఫికేషన్స్ ద్వారా ప్రిన్సిపల్ పోస్టులు: 10, డిగ్రీ లెక్చరర్స్: 480, జూనియర్ లెక్చరర్స్:185, పీజీటీ: 235, టిజిటి: 324, తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టులని ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇవి కాక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌, తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకి, ఇంటర్ సాంకేతిక విద్యలో లైబ్రెరియన్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే.      


Related Post