తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు ఖరారు

October 19, 2022
img

తెలంగాణ రాష్ట్రంలో గల 159 ఇంజనీరింగ్ కాలేజీలలో ట్యూషన్ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం బుదవారం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ కాలేజీల స్థాయి, ప్రమాణాలను బట్టి కనీస ఫీజు ఏడాదికి రూ.40,000 నుంచి గరిష్ట ఫీజు రూ.1.60 లక్షలుగా ఖరారు చేసింది. పెంచిన ఈ ఫీజులు మూడేళ్ళపాటు అమలులో ఉంటాయని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొంది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులను కూడా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీఏ, ఎంసీఏలకు కనిష్ట ఫీజు రూ.27,000గా ఎంటెక్ కనిష్ట ఫీజు రూ.57,000గా ఖరారు చేసింది. 


Related Post