నోటిఫికేషన్‌కు ముందు షార్ట్ నోటీస్... దేనికో?

September 03, 2022
img

తెలంగాణ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల భర్తీకి సంబందించి ఇప్పుడు తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఓ సారి ఆర్ధికశాఖ ఇన్ని పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిందని, మరోసారి ఉద్యోగాల భర్తీకి టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయడమో జరుగుతోంది. ఈ రెండు కుదరకపోతే మద్యే మార్గంగా టిఎస్‌పీఎస్సీ సరికొత్త విధానం అమలుచేస్తోంది. అదే... షార్ట్ నోటీస్ జారీ చేయడం. 

ఈ నెల 15వ తేదీన 1,540 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయబోతున్నామని, సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్ 10వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని దాని సారాంశం. 

మరో 12 రోజులలో నోటిఫికేషన్‌ జారీ చేయబోతూ మళ్ళీ ఈ షార్ట్ నోటీస్ ఎందుకో?అని సందేహం కలగవచ్చు. బహుశః మునుగోడు ఉపఎన్నికల ప్రభావమే అని అనుకోవాలేమో?ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఉపయోగపడుతుంది కనుక దీనిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించినా ఆశ్చర్యం లేదు.

Related Post