భారత్‌ ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

August 05, 2022
img

భారత్‌ ఆర్మీలో అగ్నిపథ్ పధకంలో భాగంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్ధులు నేటి నుంచి సెప్టెంబర్ 3వరకు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, క్లర్క్/ స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు ఆర్మీ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగాలకు వయోపరిమితి 23 ఏళ్ళు. అక్టోబర్ 1నాటికి 23 ఏళ్ళు అంతకంటే తక్కువ వయసున్న వారు మాత్రమే అర్హులు. టెక్నికల్ విభాగంలో ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణత, ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి 31వరకు సూర్యాపేట పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆవరణలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్మెంట్‌ బోర్డు అధికారులు తెలిపారు.    


Related Post