నేటి నుంచి ఎస్పీడీసీఎల్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరణ

May 12, 2022
img

తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌లో ఇటీవల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. నేటి నుంచి జూన్‌ 3వరకు వాటికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. జూలై 17న రాత పరీక్ష నిర్వహిస్తారు కనుక వారం రోజులు ముందుగా అంటే జూలై 11 నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అభ్యర్ధులకు అనుబాటులో ఉంటాయి.

ఎస్పీడీసీఎల్‌లో 1,000 లైన్ మెన్ పోస్టులు, 201 ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్, 70 అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు విద్యార్హత, వయో పరిమితి, రిజర్వేషన్స్ తదితర పూర్తి వివరాల కోసం ఎస్పీడీసీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.tssouthernpower.cgg.gov.in లో చూడవచ్చు. 


Related Post