తెలంగాణలో 1,271 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ

May 10, 2022
img

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సోమవారం 1,271 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో అత్యధికంగా 1,000 జూనియర్ లైన్ మెన్ పోస్టులుండగా, 201 ఎలక్ట్రికల్ సబ్-ఇంజనీర్, 70 అసిస్టెంట్ ఇంజనీరి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాలను ఈ నెల 20వ తేదీన విడుదల కాబోతోంది. 11వ తేదీన తమ అధికారిక వెబ్‌సైట్‌ https://tssouthernpower.cgg.gov.in లేదా https://www.tssouthernpower.com లలో పొందుపరుస్తామని నోటిఫికేషన్‌లో తెలిపింది.  


Related Post