తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

November 24, 2021
img

వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో జరుగబోయే ఇంటర్ ప్రధమ, ద్వితీయ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపుకు డిసెంబర్‌ 13వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్‌మీడియెట్  బోర్డ్ ప్రకటించింది. ఆ తరువాత డిసెంబర్‌ 23వరకైతే రూ.120 డిసెంబర్‌ 30 వరకు రూ.500, జనవరి 4వరకు రూ.1,000, జనవరి 20 వరకు రూ.5,000 అపరాధ రుసుము చెల్లించి పరీక్షలకు హాజరుకావచ్చని తెలిపింది.   

ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ వంటి గ్రూప్‌లకు మొదటి ఏడాది పరీక్ష ఫీజు రూ.500, వొకేషనల్ కోర్సులకు రూ.700, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు రూ.145, మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సుకు రూ.200, వొకేషనల్ కోర్సులలో బ్యాక్‌లాగ్ ప్రాక్టికల్ పరీక్షలకు రూ.200 చొప్పున ఫీజుగా నిర్ణయించినట్లు ఇంటర్ బోర్డు కమీషనర్‌ శేషరిగిబాబు తెలిపారు. 


Related Post