తెలంగాణ పాలిసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు

June 12, 2021
img

తెలంగాణ సాంకేతిక విద్యా మండలి పాలిసెట్-2021 దరఖాస్తుల సమర్పించుటకు గడువు పొడిగించింది. పాలిసెట్ షెడ్యూలు ప్రకారం దరఖాస్తుల సమర్పణ శుక్రవారంతో గడువు ముగిసింది. దానిని ఈ నెల 18వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. జూన్‌కు 18వరకు ఆలస్య ఫీజు లేకుండా దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆ తరువాత రూ.100 ఆలస్య రుసుముతో జూన్ 20 వరకు, రూ.300తో జూన్ 22 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. అయితే పాలిసెట్ కామన్ పరీక్ష తేదిని ఇంకా ప్రకటించలేదు. మరిన్ని వివరాలకు http://polycetts.nic.in లో చూడవచ్చు.


Related Post