శుక్రవారం నల్లగొండలో ఆన్‌లైన్‌ జాబ్‌మేళా

April 29, 2021
img

నల్లగొండ జిల్లాలో రేపు ఆన్‌లైన్‌ వేదిక ద్వారా జాబ్ మేళా జరగనుంది. నల్గొండ జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ప్రకటనను విడుదల చేశారు. ఈ జాబ్‌మేళాలో పలు ప్రైవేటు సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హులు: 10 నుండి పీజీ వరకు చదువుకున్న విద్యార్థులు. 

ఈ ఆన్‌లైన్‌లో జాబ్‌మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి వేతనం నెలకు రూ.15 వేల నుండి రూ.20 వేల వరకు లభిస్తుందని జిల్లా ఉపాధి అధికారి తెలిపారు. ఈ జాబ్‌మేళాకు హాజరవ్వాలనుకొనేవారు ముందుగా   www.ncs.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకుని ఆ తర్వాత వారి రెజ్యూమ్‌ను onlinejobmelaresume@gmail.com కి పంపాలని జిల్లా ఉపాధి అధికారి తెలిపారు. ఈ ఆన్‌లైన్‌ జాబ్‌మేళాకు సంబందించి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్: 82476 56356. 

Related Post