తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు?

April 15, 2021
img

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నందున రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయనున్నట్లు తాజా సమాచారం. రాష్ట్రంలో సుమారు 5.35 లక్షల మంది పదో తరగతి విద్యార్దులున్నారు. వారందరినీ పరీక్షలు వ్రాయకపోయినా పైతరగతులకు ప్రమోట్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. 

విద్యాశాఖ చేసిన ఈ సిఫార్సుల ఫైలు సిఎం కేసీఆర్‌ సంతకం కోసం వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వ నిర్ణయమే కనుక సిఎం కేసీఆర్‌ దీనికి ఆమోదం తెలుపడం ఖాయమే. సిఎం కేసీఆర్‌ ఆ ఫైలుపై సంతకం చేయగానే విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 


Related Post