లాసెట్ ఎంట్రెన్స్ దరఖాస్తుల స్వీకరణ

March 25, 2021
img

తెలంగాణలో లాకాలేజీలలో  ప్రవేశాల కొరకు నిర్వహించే లాసెట్ ఎంట్రెన్స్ దరఖాస్తుల స్వీకరణ బుదవారం నుంచి ప్రారంభమయ్యింది. మూడేళ్ల ఎల్.ఎల్.బి మరియు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులలో ప్రవేశాలకు ఈ లాసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. 

అర్హతలు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులు 45 శాతం మార్కులు, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులైతే 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 

మూడేళ్ల లా కోర్సులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు 45 శాతం అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్ష రాసేవారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. లాసెట్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తున్నారు.

లా సెట్ అప్లికేషన్ ఫీజ్ : జనరల్ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు రూ.500

పీజీ లాసెట్ ఫీజు: జనరల్  రూ 1000, ఎస్సీ, ఎస్ టి,  దివ్యాంగుల అభ్యర్థులకు రూ 800

లా సెట్ దరఖాస్తులు సమర్పించడానికి చివరితేదీ : మే 26

 రాత పరీక్ష : ఆగస్టు 23

Related Post