ఇంటర్, డిగ్రీ విద్యార్దులకు ఆన్‌లైన్‌లో పాఠ్యపుస్తకాలు

January 22, 2021
img

తెలంగాణ విద్యార్థులకు తెలుగు అకాడమీ శుభవార్త తెలిపింది. కరోనా కారణంగా విద్యకు దూరమైన ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌లో పాఠ్యపుస్తకాలను ఉంచినట్టు తెలుగుఅకాడమీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో పాఠాలను వీడియో రూపంలో కూడా పొందుపరిచినట్లు తెలిపారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఆన్‌లైన్‌లో తరగతులు బోధించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వీటికి సంబందించి పూర్తి వివరాల కోసం www.teluguacademy.gov.in లో  చూడవచ్చు.


Related Post