నీట్ పీజీ-2021 పరీక్ష తేదీ ప్రకటన

January 15, 2021
img

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) నీట్ పీజీ 2021 పరీక్ష తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 18వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా తాజా పరిస్థితి గురించి కేంద్ర వైద్యఆరోగ్యశాఖను సంప్రదించిన తరువాతే తేదీని ఖరారు చేశామని కానీ పరీక్ష నిర్వహించే సమయానికి ఒకవేళ కరోనాతో మళ్ళీ విపత్కర పరిస్థితులు ఏర్పడితే పరీక్ష తేదీని మార్చే అవకాశం ఉంటుందని ముందే తెలిపింది. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ పరీక్షకు సంబందించి పూర్తి వివరాల కొరకు  https://natboard.edu.in/  లేదా https://nbe.edu.in  వెబ్‌సైట్లను సందర్శించాలని ఎన్‌బీఈ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. 

అర్హతలు: ఈ పరీక్షకు హాజరయ్యేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) చేత గుర్తింపు పొందిన వైద్యకళాశాల జారీ చేసిన తాత్కాలిక లేదా శాశ్విత సర్టిఫికేట్ ఎంబిబిఎస్ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఎంసీఐ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ జారీ చేసిన తాత్కాలిక లేదా శాశ్విత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా కలిగిఉండాలి. జూన్‌కు 30, 2021లోపుగా ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తి చేసి ఉండాలి.

Related Post