త్వరలో 16,781 విద్యావాలంటీర్ల నియామకం

June 04, 2018
img

కోర్టు కేసుల కారణంగా టి.ఆర్.టి. పరీక్షా ఫలితాలు విడుదలవకపోవడం చేత కొత్త ఉపాద్యాయుల నియామక ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు. జూన్ 1వ తేదీ నుంచి తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకోవడంతో 2018-19 విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యింది. కనుక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,781 ఉపాద్యాయ పోస్టులను విద్యావాలంటీర్లతో తాత్కాలికంగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం అయినందున తక్షణమే విద్యావాలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. వారికి రూ. 12,000 గౌరవ వేతనంగా నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలలో తెలుగు భోధన తప్పనిసరి కనుక 1,308 తెలుగు ఉపాద్యాయులను (విద్యా వాలంటీర్లను) తీసుకుంటారు.



Related Post